అమ్మాయి ప్రేమ పరిణయం 32

By | March 5, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 32 ఆలోచనల్లో ఉన్న అతను "అన్నయ్యా" అన్న సౌజన్య పిలుపుతో ఈ లోకం లోకి వచ్చాడు. ఆమె అతని దగ్గరికి వస్తూ "అబ్బా ఇక్కడున్నావా...ఇందాకటి నుండి నీ కోసం వెతుకుతున్నాను తెలుసా" అంది. "ఏంటి విషయం" "బోర్ కొడుతోంది ఎక్కడికైనా వెళ్దామా" "ఇప్పుడా...ఇప్పుడొద్దులేరా ఇంకెప్పుడైనా వెళ్దాం" అన్నాడు అతనికి ఆ రోజు మూడ్ అసలు బాగాలేకపోవడంతో "ఇంకెప్పుడూ...నువ్వు ఇండియాకి వచ్చి మూడు నెలలైనా నీకు ఇక్కడికి రావడానికి తీరిక దొరకలేదు. ఇప్పుడు కూడా ఏదో తాతయ్య ఇక్కడికి వచ్చారు కాబట్టి కనిపించావు. లేకపోతే అసలు ఇటు వైపుకి వచ్చేవాడివి కూడా కాదు. ఫోన్ చేసినా ఎప్పుడో కానీ లిఫ్ట్ చెయ్యవు. ఇంకెప్పుడు నువ్వు ఫ్రీ గా ఉండేది. అయినా ఇవాళ సెలవే కదా రావచ్చుగా...అదే అన్నయ్య అయితే అడిగిన వెంటనే బయటకి తీసుకెళ్ళేవాడు. నువ్వేమో ఇన్ని సార్లు అడిగించుకుంటున్నావు." "సరే సరే అలగకులే తీసుకువెళ్తాను" "అయితే లంచ్ కి వెళ్దామా.. ఇప్పుడే అమ్మకి చెప్పేసి వస్తా మనం లంచ్ కి బయటకి వెళ్తున్నాం అని" "లంచ్ కి కుదరదులే...నాకు వేరే పనుంది.... డిన్నర్ కి వెళ్దాం." "అయితే నన్ను సాయంత్రం షాపింగ్ కి తీసుకెళ్తావా" "మళ్లీ ఇదొకటా" "ప్లీజ్..ప్లీజ్.. అన్నయ్య" అతను నవ్వుకుంటూ "సరే" అన్నాడు ఆ మాట వింటూనే సంతోషంగా లోపలికి పరిగెత్తింది సౌజన్య. సౌజన్య రాకతో చెదిరిపోయిన ఆలోచనలు ఆమె వెళ్ళగానే మళ్ళీ అతన్ని చుట్టుముట్టాయి. వెంకట్రామయ్య తాతయ్య చెప్పింది నిజమే తాతయ్య కి సాధారణంగా అనుమానం అనేది రానే రాదు. వచ్చిందంటే మాత్రం అది పోగొట్టడం చాలా కష్టం. కానీ అదృష్టం ఆయనకి ఇంకా పూర్తి నిజం తెలియలేదు తెలిసుంటే ఆయన తట్టుకోలేకపోయేవారు. ఒకవేళ అదృష్టం బావుండి తట్టుకొని నిలబడినా ఇంక నా మొహం

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *