మొండి 7 డార్క్ వెబ్

By | March 5, 2020
telugu stories kathalu novels మొండి 7 డార్క్ వెబ్ "డార్క్ వెబ్" అన్న మాట రవి సార్ నోటి నుండి ఎప్పుడు వెలువడిందో గాని, వీరు జీవితం ఆ క్షణం నుండి, మారిపోయింది. తను తెలుసుకోబోతున్న విషయం అతన్ని జివితం మొత్తం వెంటాడబోతోంది అని తెలియక, ఇంకా ఆసక్తిగా అడుగుతున్నాడు వీరు " అంటే ఏంటి" అని. పక్కన ఎవరైనా ఉన్నారా అని స్టాఫ్ రూం మొత్తం చూసుకున్న తరువాత వీరు ని పిలిచి కంప్యుటర్ ముందు కుర్చోబెట్టుకున్నాడు, రవి. " సింపుల్ గా చెప్తా విను. ప్రపంచం లో ఉన్న వెబ్సైట్లు అన్నీ ఎలా యాక్సెస్ చేస్తున్నాం ? అవి ఉన్నాయని మనకు ఎలా తెలుస్తోంది? " " గూగుల్ ద్వారా వెతికితే " " అదే మరి. గూగుల్ లిస్ట్ లో కనిపించనివి. ఏ సర్చ్ ఇంజన్ లో లేనివి వెబ్సైట్లు ఎన్ని ఉంటాయి?" " దాదాపుగా ఉండవు కదా సార్ " " అదే వీరు ఇక్కడ తేడా . మనకు తెలిసిన గూగుల్ , యాహు, అన్ని సర్చ్ ఇంజన్లు కలిపినా ప్రపంచం మొత్తం మీద ఉన్న వెబ్సైట్లు 10 శాతం కు మించి మనకు దొరకవు. గూగుల్ వాడి పాలసీ ప్రకారం కూడా కొన్ని రకాల వెబ్ సైట్లను సర్చ్ లో చూపించడానికి అనుమతించదు. " " ఎలాంటి వెబ్సైట్లు లను అనుమతించరు ?" " భయంకరమైన వెబ్ సైట్లు " ఆ మాట తో రూమ్ లో కాసేపు నిశబ్దం ఆవరించుకుంది కాసేపు. నిశబ్దాన్ని ఛేదిస్తూ రవి సార్ " ముందు ఈ సిస్టం లోకి TOR బ్రౌసర్ ని డౌన్లోడ్ చెయ్ " అన్నాడు. వీరు ఇంకొక మాట మాట్లాడకుండా TOR అనే బ్రౌసర్ ను వెతికి డౌన్ లోడ్ చేసాడు. ఒక వెబ్ పేజీ ఓపెన్ చేసాడు." డార్క్ వెబ్ ని బ్రౌసింగ్ చెయ్యాలంటే ఈ బ్రౌసర్ ని వాడతారు" " ఇది ఒక డార్క్ సర్చ్ ఇంజన్ వెబ్ సైట్ . లిస్ట్ చూస్తున్నావ్ గా ?" అని అడిగాడు. ఒక్కో వెబ్ సైట్ ఒక్కో టైటిల్ తో ఉంది. చైల్డ్ పోర్న్ ., అన్న మాట చూసి ఒక్క క్షణం మైండ్ పని చెయ్యడం మానేసింది వీరు కి. " ఇలాంటి సైట్లు కూడా ఎవరు పెడతారు సార్ " " ఇవే కాదు. ఇలాంటి సైకిక్ సైకిక్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *