అమ్మాయి ప్రేమ పరిణయం 42

By | March 16, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 42 "వదులు...ముందు చెయ్యి వదులు...నాతో మాట్లాడకు...నిన్న రాత్రంతా ఎంత టెంషన్ పడ్డామో తెలుసా...ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచాఫ్ వస్తోంది. నీకంత వర్క్ ఉంటే కాల్ చేసి చెప్పుండాల్సింది. కనీసం మా టెంషన్ అయినా తగ్గేది కదా..అహ ఎందుకు చెప్తావు నువ్వు చెప్పవు...మేము టెంషన్ పడితే నీకేంటి పడకపోతే నీకేంటి..." అంది విసురుగా ఆమె చేతి నుండి తన చేతిని తప్పిస్తూ. ముక్త మళ్ళీ ఆ చెయి పట్టుకొని "అది ఎప్పుడు స్విచాఫ్ అయిపోయిందో నేను చొసుకోలేదే...ఈసారి నుండి నాతో పాటు చార్జర్ ని కూడా తీసుకొని వెళ్తా ఆఫీస్ కి...సరేనా...కోపం పోయిందా" అంది "అయినా ప్రపంచం మొత్తం లో నీ ఫోన్ ఒక్కటే ఉందా....అసలు మీ ఆఫీస్ లో ఫోనే లేదా...లేకపోతే మీ కలీగ్స్ దగ్గర ఫోన్ లేదా... నీ ఫోన్ లేకపోతే మీ ఆఫీస్ ఫోన్ నుండో మీ కొలీగ్స్ ఫోన్ నుండో చేసుండచ్చు నీకు చేసే ఉద్దేశం ఉంటే...ఆ మాత్రం బుర్ర లేకుండా ఉండదు కదా నీకు" అంది సారిక దగ్గరికి వస్తూ "చెయ్యచ్చనుకో కానీ" నసిగింది ముక్త చరిత వెనకే నడుస్తూ చెయ్యనందుకు రీసన్ చెప్తే ఇంకెంత తిడతారో "చెయ్యలేదు. మీ ఆఫీస్ లో అసలు ఒక్క ఫోన్ కూడా లేదు అంతేనా" అంది చరిత వ్యగ్యంగా "అహ అలా అని కాదు" "మరి ఎందుకు చెయ్యలేదు..." అడిగింది సారిక "అంటే...నంబర్ నా ఫోన్ లో ఉండిపోయింది" అని చిన్నగా అని చరిత వైపు చూసింది ఏమంటుందో అని "ఏంటి" అన్నారు ఇద్దరూ ఒకేసారి "నీకు మా నంబర్లు తెలీవా..అంటే కనీసం మా ఫోన్ నంబర్లు కూడా గుర్తుపెట్టుకోలేదా" "సారీ...సారీ...ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా" అంది ఓరగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ. అప్పటికే వాళ్ళిద్దరూ ఆమె వంక గుర్రుగా చూస్తున్నారు. ఆమె ఆ చూపులను తప్పించుకుంటూ "నాకు ఆకలేస్తోంది నిన్న రాత్రి కూడా వర్క్ లో ఉండి డిన్నర్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *