ఇదీ కధ 8

By | November 22, 2019
ఇదీ కధ 8 ప్రొఫెసర్!' సాగర్ బిగ్గరగా అరిచాడు. చంద్రశేఖర్ తొట్రుపాటు పడ్డాడు. "ఏమైంది , సాగర్!' భుజం పట్టుకొని ఊపుతూ అన్నాడు. "నా బుర్ర తిరిగిపోతున్నది. నాకేలాగో అనిపిస్తుంది!" "ప్లీజ్ రిలాక్స్! మిస్టర్ సాగర్ టేకిట్ ఈజీ యూ ఆర్ అల్ రైట్!" "నేను బాగానే ఉన్నాను. కాని మాధవి ....నా మాధవి ----తలచుకుంటేనే నా గుండె బ్రద్దలవుతుంది ప్రొఫెసర్!" "మాధవికి అలాంటి ప్రమాదమేమీ లేదు. మాధవిని ఓసారి నా దగ్గరకు తీసుకురా/ లేట్ మీ ఎగ్జామిన్ హర్!" "రేపు తీసుకు రమ్మంటారా?" "రేపు కాదు! నువ్వు ఇచ్చిన డేటా అంతా నేను ఎనలైజ్ చేయాలి. కనీసం నాకు ఇరవై నాలుగు గంటలయినా కావాలి. మాధవిని ఎల్లుండి తీసుకురా! ఎల్లుండి సాయంత్రం అయితే నేను ఫ్రీగా ఉంటాను." "అలాగే ప్రొఫెసర్!' సాగర్ ప్రొఫెసర్ చంద్ర శేఖరం దగ్గర శెలవు తీసుకొని బయలుదేరాడు. సాగర్ అటు వెళ్ళగానే ప్రొఫెసర్ టేప్ అన్ చేసి వినసాగాడు. విన్న కొద్దీ ప్రొఫెసర్ ఆలోచనలు పరుగులు తీయసాగాయి. అసలు ఈ సాగర్ చెప్పిన దానిలో నిజమెంత? కల్పన ఎంత? ఇతని మానసిక స్థితి ఎలాంటి దశలో ఉన్నది? తనకు తెలుసు మానసిక శ్రాస్త్రం అధ్యయనం చేసే విద్యార్ధులు కొందరు ఏదో రకమయిన మానసిక రుగ్మతకు గురి కావడం - సాగర్ ఆ కోవలోకి వస్తాడా? టేపు ఆగిపోయింది. ప్రొఫెసర్ తలెత్తి చూసాడు. ప్రొఫెసర్ గారి భార్య టేప్ రికార్డర్ మీద నుంచి చెయ్యి తీసి భర్త కేసి చూసింది. "ఇహ నా వల్ల కాదు!" రుస రుస లాడింది ఆమె. "ఏమిటి?" అడిగాడు అతడు. 'అదే?" "నాతొ కాపరం చేయడమా?" ముసి ముసి నవ్వులు నవ్వాడు ప్రొఫెసర్. "అవును! నేను కావాలో ఆ వంటవాడు కావాలో ముందు తేల్చుకోండి!" "వంటవాడితో కాపరం చెయ్యమంటావా!" పకపక నవ్వాడు భర్త. "వాడూ మీరూ కట్టకట్టుకొని

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *