మనసున మనసై 7

By | November 22, 2019
మనసున మనసై 7   "ఓ సారీ, చాలురా బాబూ మీ జోకులతో హోటలు అదరగొట్టేస్తున్నాం. పల్లెటూరి బైతులనుకోగలరు....' శ్రీధర్ నెమ్మదిగా అన్నాడు. అంతే కాసేపు తిండిలో పడ్డారు. ఆ పచ్చడి ట్రై చెయ్యి. ఆ పులుసు తిని చూడు...' అంటూ ఒకరికొకరు వడ్డించుకున్నారు. "ఏయ్ జయంతి నీవేమిటి అంత సైలెంట్ గా వున్నావు..... మాట్లాడకుండా" అంది ఉషారాణి. "మీరంతా మాట్లాడుతుంటే వింటున్నాను'; అంది నవ్వి జయంతి. "మీరేం జోకులు చెప్పలేదు అసలు- ఇప్పుడు మీ వంతు. అన్నాడు శ్రీధర్, జయంతి గాభరాగా 'అబ్బే..... అబ్బే నాకేం రావు...' అంది తడబడ్తూ. 'మనం అంటే జంటలుగా వచ్చాం.. పాపం తను ఒక్కర్తే అని ఫీలయిపోతూంది నాఫ్రెండ్' అంది ఉషారాణి నవ్వి.... జయంతి మొహం సిగ్గుతో ఎర్రబడింది. 'అన్యాయం..... నన్ను మరిచిపోయారు... నేనూ ఒంటరేనండి బాబూ' అన్నాడు దివాకర్ బుంగమూతి పెట్టుకుని. "ఓ..... ఐథాట్ ... మీ ఇద్దరూ హజ్బెండ్ అండ్ వైఫ్ .... అనుకున్నా" నాలుక కరుచుకుంటూ అంది భావిక. పేర్లు చెప్పాడు తప్ప ఫలానా వారి భార్య భర్త అని పరిచయం చేయలేదు శ్రీధర్ ఆమెకి. మిగతా అందరిలాగా వారిద్దరూ జంట అనుకుంది ఆమె. "చంపావు పో" అన్నాడు శ్రీధర్- ఫరవాలేదు, మీ నోటి చలవ వల్ల అలా జరిగితే అందరం సంతోషించవచ్చు' ఉషారాణి కొంటెగా అంది. 'మీ ఎంగర్ సిస్టర్ అన్నారు ఆవిడని, ఆవిడని పెళ్ళయింది కనుక మీకు పెళ్ళయిందనుకున్నాను. జంటలు లెక్క పెట్టుకుని మీ యిద్దరి గురించి సారీ....' నొచ్చుకుంటూ సంజాయిషీ ఇస్తూ అంది భావిక జయంతితో. జయంతికి ఏమనాలో తోచలేదు. 'ఓకె ఇట్సాల్ రైట్....' శ్రీధర్ అంటూ స్నేహితులవైపు తిరిగి 'దివాకర్ మన ముగ్గురిలో నీవే మిగిలావు. త్వరగా పెళ్ళి చేసుకో మరి...' 'శుభస్య శ్రీఘ్రం అని మనమే అక్షింతలు జల్లేద్దామా ఇద్దరి మీద హాస్యంగా అన్నాడు గోపాలకృష్ణ- దివాకర్ కూడా కాస్త సిగ్గుపడ్డాడు. "షటప్ యార్" అన్నాడు చిన్నగా కసిరి. "సారీ.... సారీ... ఏదో సరదాకి' గోపాలకృష్ణ అన్నాడు. 'ఆ సరదా.... నిజం అయితే బాగుండును అని వుంది నాకు' ఉషారాణి దివాకర్ వంక చూసి హాస్యంగా అంటూ తొందరేం లేదు.... టేక్ యువర్ ఓన్ టైమ్' ఆలోచించండి ఈ ప్రపోజల్...' అంది. జయంతికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత సిగ్గుముంచుకు వచ్చింది. "మీరంతా మరీ ఎంబ్రాస్ చేస్తున్నారు పాపం ఆవిడని" దివాకర్ అన్నాడు కంప్లైంట్ చేస్తున్నట్లు. 'ఓకె ఓకె ఇంక ఆ టాపిక్ వదిలేద్దాం.. స్వీట్స్.... ఐస్ క్రీములున్నాయి...' శ్రీధర్ లేచి నిల్చుని అన్నాడు. 'ఐయామ్ ఫుల్... బాబోయ్ యింక నాకేం వద్దు 'రాహుల్ అన్నాడు. మనకు ఐస్ క్రీములకేం లోటు అందుకే పచ్చళ్ళు పులుసులు, కూరలతో సుష్టుగా తినేశాను..' 'బాబోయ్ ఇన్ని రకాలు పెడితే ఎవరు తినగలరు... ఒకో చమ్చా రుచి చూసినా సగం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *