మొండి 27 లింక్

By | March 27, 2020
telugu stories kathalu novels మొండి 27 లింక్ మరుసటి రోజు ఉదయం లేచీ లేవగానే తిరిగి కేసుకి సంబందించిన లింక్ కనుక్కునే పనిలో పడ్డారు ముగ్గురు. పొద్దున్న ఫ్రెష్ గా కూర్చుని లాజిక్ కోసం ఆలోచిస్తున్న వీరూ ప్రొఫెసర్ చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటున్నాడు. " ఎప్పుడూ మనం ఏ దారిలో ఆలోచించినా సమస్యకి సమాధానం దొరకకపోతే trial and error ని try చెయ్యాలి." అప్పటిదాకా నేర్చుకున్న టెక్నీక్స్ అన్నింటినీ నెమరు వేసుకున్నాడు వీరు.మిగతా ఇద్దరు కూడా తమ దగ్గరున్న డేటాని అనలైజ్ చేస్తూ కూర్చున్నారు వీరు లాప్ టాప్ తీసుకుని అప్పటిదాకా దొరికిన డేటాని అనలైజ్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి తట్టింది, అతనికి ఒక సరికొత్త ఐడియా. దాన్ని వెంటనే అమలు లోకి తీసుకొచ్చాడు. డిలీట్ అయిన ఫైల్స్ అన్నీ చూస్తున్నాడు. .apk ఫైల్స్ ఉన్నాయి, యాప్ లకు సంబందించినవి అవి. ఒక సారి సెల్ ఫోన్ ఇమ్మని పట్నాయక్ దగ్గర ఫోన్ తీసుకున్నాడు.అన్ ఇంస్టాల్ చేసిన యాప్స్ అన్నీ తీసుకుని ఇన్స్టాల్ చేస్తున్నాడు. అన్నీ ప్లే స్టోర్ లో ఉన్నవే కాబట్టి వెంటనే ఓపెన్ అవుతున్నాయి. గూగుల్ డాక్స్ లో కూడా వెతికి చూసాడు. కొత్తగా ఏమి కనిపించడం లేదు. మరి కాసేపటిపాటు చేస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న అశోక్ సింగ్ , పట్నాయక్ ఇద్దరూ వీరు ముఖం వెలిగిపోవడం గమనించారు. అలా సీరియస్ గా ఆలోచిస్తున్నప్పుడు కదిలించడం ఎందుకని , సైలెంట్ గా ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారు. అలా దాదాపు 3 గంటలు గడిచాక వచ్చింది ఆ క్షణం. వీరు ముఖంలో లక్ష వాట్ల బల్బ్ వెలిగినంత ఆనందం కనిపించింది. వెంటనే " ఒక సారి చూడండి " అని పిలిచాడు. ఇద్దరూ వచ్చి వీరు దగ్గర కూర్చున్నారు. "వాళ్ళ రిక్రూట్మెంట్ సోర్స్ దొరికింది సార్". అన్నాడు. ఇద్దరూ షాక్ అయ్యి వీరు చెప్పేది వినడం

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *