రాజ్య సింహాసనం 15

By | November 21, 2019
రాజ్య సింహాసనం 15 మంజుల చెప్పింది విన్న స్వర్ణమంజరి ఆలోచన బాగుందన్నట్టు తల ఊపుతూనే, “కాని…..ఇక్కడో చిన్న చిక్కు ఉన్నది మంజుల,” అన్నది. “ఇంకా ఇందులో చిక్కేంటమ్మా….” అనడిగింది మంజుల. “వేటకు కాని…..వనవిహారానికి కాని నేను వెళ్లాలంటే నా భర్తతో మాత్రమే వెళ్లాలి కదా….మరి ఆదిత్యసింహుడు ఎలా వస్తాడు,” అన్నది స్వర్ణమంజరి ఆలోచిస్తూ. “అవునమ్మా….నేను ఈ విషయం ఆలోచించలేదు….ఇప్పుడెలా….” అనడిగింది మంజుల. “దానికి ఒక ఉపాయం ఉన్నది…..వనవిహారానికి వెళ్లిన తరువాత మనకు నమ్మకమైన సైనికులతో ఆయన్ని మన గుడారాలకు దూరంగా….వనాల్లో దారి తప్పేలా చేయాలి….” అన్నది స్వర్ణమంజరి. “అవునమ్మా…..మీరు అన్నది నిజమే….కాని….ఆ సైనికులు ఆదిత్యసింహుడి సైనికులు అయితే ఈ కార్యాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా చేస్తారు,” అన్నది మంజుల. “సరె….కాని ఆదిత్యసింహుడికి తన కొరిక తీరుస్తానని నేను ఒప్పుకుంటే…..లోకువ అయిపోతానేమో….” అన్నది స్వర్ణమంజరి. “ఆదిత్యసింహుడికి మీ మీద కోరిక బాగా ఉన్నది…..నేను మీ సందేశాన్ని ఆదిత్యసింహుడికి వివరించి….పరిస్థితి చెబుతాను….దాన్ని బట్టి ఆయనే ఒక పధకం ప్రకారం మీతో గడిపేలా చూసుకుంటాడు….” అన్నది మంజుల. “కాని మా ఇద్దరి కలయిక కేవల ఈ ఒక్కసారి మాత్రమే….మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదు….అది కూడా మాకు ఇష్టమైతే తప్ప….” అన్నది స్వర్ణమంజరి. “అలాగే….తప్పకుండా ఆయనకు చెబుతానమ్మా….మరి….” అంటూ ఆగింది మంజుల. “ఇంకా ఏంటి….” అనడిగింది స్వర్ణమంజరి. “ఏం లేదమ్మా….మీరు ఒప్పుకుంటున్నట్టు ఆదిత్యసింహుడి గారికి సమాచారం చేరవేయమంటారా…..” అని అడిగింది మంజుల. “అలాగేలేవే…..నేను చెప్పినప్పుడు వెళ్దువు గాని,” అన్నది స్వర్ణమంజరి. దాంతో ఇద్దరూ అక్కడ నుండి బయటకు వచ్చారు. శయనమందిరంలో తన భర్త విజయసింహుడు ప్రశాంతంగా నిద్ర పోవడం చూసి స్వర్ణమంజరి అసహనంగా అతని పక్కనే పడుకున్నది. మంజుల స్వర్ణమంజరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. కాని స్వర్ణమంజరికి మాత్రం నిద్ర పట్టలేదు. మంజుల చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. ఆదిత్యసింహుడి కోరిక తీర్చిన తరువాత జరగబోయే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *