ఇదీ కధ 5

By | November 21, 2019
ఇదీ కధ 5   "సాగర్! ఓ సాగర్! ప్లీజ్ నన్నడగకు! నాకు భయం వేస్తున్నది!" సాగర్ చేతుల్లో వణికిపోయింది మాధవి. ",మాధవీ! భయం లేదు. నువ్వు నాదగ్గర వున్నావు. నీకేం భయం లేదు. జరిగిందేమిటో చెప్పు, ఇప్పుడే చెప్పాలి, లేకపోతే మళ్ళీ మర్చిపోతావు?" "సాగర్! అది మర్చిపోయేది కాదు. వద్దనుకున్నా జీవితాంతం గుర్తుకు వస్తుంది." "సాగర్ మాధవినో గుండెలకు హత్తుకొని అనునయించాడు. "మాధవి - నా మాధవి?" "ఊ!" "ఏం జరిగిందో నాకు చెప్పవా?" "నా ప్రెషర్ కుక్కర్ ను ఎత్తుకుపోయాడు." "ఏదీ నీకు ఫ్రైజ్ గ వచ్చినదా?" "అవును౧ అదే!" "ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?" "టైం సరిగ్గా గుర్తులేదు. రాత్రి పన్నెండు దాటి ఉంటుందనుకొంటాను. బాత్ రూమ్ నుంచి వంటగదిలోకి వెళ్ళాను. వంటగది వెనుక తలుపులు తెరిచి వుంది. లైట్ వేసి చూశాను. గదిలో గిన్నెలు వంట పాత్రలు చిందర వందరగా పడి వున్నాయి. దొడ్లోకి వచ్చాను. అప్పుడే వాడు గోడ దూకేశాడు. ప్రెషర్ కుక్కర్ తీసుకొని పారిపోయాడు. నేను దొంగ! దొంగ! అని అరుస్తూ నాన్నగారి గది ముందుకు పరుగెత్తు కొచ్చాను, నాన్న గది తలుపు తెరచి ఉంది...." "ఊ ఆగిపోయావేం/ తర్వాత?" "నాన్న - మంచం పక్కన రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు! నాన్న పక్కనే అమ్మ బోర్లా పడి ఉంది. మెడ కింద రక్తం గడ్డకట్టి ఉన్నది." "మాధవీ! నువ్వేం మాట్లాడుతున్నావు?' సాగర్ కంఠం వణికింది. "అమ్మా నాన్నను హత్య చేసి నా ప్రెషర్ కుక్కర్ ను ఎత్తుకు పోయాడు." "ప్రెషర్ కుక్కర్ కోసం రెండు హత్యలు చేశాడంటావా?" సాగర్ ఆలోచనలో పడ్డాడు. మాధవి చెప్పిందంతా ఓ కధలా వుంది. ఇది ఆమె మరొక ఊహ చిత్రం. మతి భ్రమణకు ముందు ఉండే మానసిక స్థితిలో ఉన్నా మాధవి మస్తిష్కంలో అసంభవమూ, అనూహ్యమూ అయిన సంఘటనలు ప్రకోపన చెంది, అవి వాస్తవిక సంఘటన లానే భ్రమను కల్పించి , ఆమె మనసులో అనేక ప్రేరణలను, పీడనలకు దారి తీస్తున్నాయి. "మా అమ్మా, నాన్నను హత్య చేశాడు!' మాధవి చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఎదవా సాగింది. మాధవి గొంతు నిజంగా చిల్లపిల్ల గొంతులా అయిపొయింది. "ఎవడు వాడు?" "వంటవాడు!" "వంటవాడా?" "అవును! వంటవాడే! వంటవాడే! అమ్మా నాన్నను చంపేశాడు! ...చంపేశాడు.....చంపేశాడు!" మాధవి పెద్దగా అరిచి అరిచి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *